ఈఎంఐ.. వాయిదా వేయాలా @ ఫ్రాడ్ కాల్

by  |
ఈఎంఐ.. వాయిదా వేయాలా @ ఫ్రాడ్ కాల్
X

దిశ వెబ్ డెస్క్: ఓ వైపు ప్రజలంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. మరో వైపు ఈ సమయమే తమకు అనువైందిగా మార్చుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. కరోనాతో ముడిపడిన ప్రతి అంశాన్ని సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారు. ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలంటూ, కరోనా మ్యాప్ అంటూ , వైరస్ తో కూడిన సినిమాలంటూ.. ప్రజలను మోసం చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల దృష్టి ఇప్పుడు ఈఎంఐల మీద పడింది. కరోనావైరస్ కారణంగా దాదాపు అన్ని కంపెనీలు షట్ డౌన్ అయ్యాయి. దాంతో ఈఎంఐలు కట్టుకునేవారికి రిజర్వు బ్యాంకు ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. మూడు నెలల పాటు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారటోరియం విధించింది. అయితే సైబర్ నేరగాళ్లు దీన్ని కూడా ఉపయోగించుకుని ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు దొంగిలించడం ప్రారంభించారు.

ప్రవీణ్ ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. ప్రస్తుతానకి లాక్ డౌన్ పీరియడ్ కావడంతో .. ఇంటి నుంచే పని చేస్తున్నాడు. అతడు పని చేసే సంస్థే ల్యాప్ టాప్ సమకూర్చింది. నెట్ బెల్ కూడా పే చేస్తోంది. సో ప్రవీణ్ రోజులానే … శుక్రవారం కూడా ల్యాప్ టాప్ ముందు పెట్టుకుని తన ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. ఇంతలోనే ఓ అన్ నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. సార్ మీరు ఫలానా కార్డు వాడుతున్నారుగా? రిజర్వ్ బ్యాంక్ చెప్పిన ప్రకారం మీరు మూడు నెలల ఈఎంఐ వాయిదా వేయాలని అనుకుంటున్నారా? అయితే మీ మొబైల్ కు ఓ ఓటీపీ వస్తుంది. అది చెప్పండి సార్ అంటూ అవతలి వ్యక్తి తెలిపాడు. దాంతో ప్రవీణ్ తన పని తాను చేసుకుంటూ.. ఆ ఫోన్ చేసిన వ్యక్తికి ఓటీపీ చెప్పాడు. థ్యాంక్యూ సో మచ్ సార్ , మీ పని కొన్ని క్షణాల్లో పూర్తవుతుంది. హావ్ ఏ గుడ్ అంటూ కాల్ కట్ చేశాడు. కొన్ని నిముషాల్లోనే ప్రవీణ్ అకౌంట్లోని డబ్బంతా డ్రా అయిపోయాయి. ప్రవీణ్ వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లు కేసు ఫైల్ చేసుకుని విచారణ జరుపుతామని తెలియజేశారు

ఒక వేళ మీకు కూడా అలాంటి కాల్ వస్తే.. వెంటనే కట్ చేయండి. ఒకవేళ మీరు వారి మాటలు నమ్మి ఓటీపీ చెప్పారంటే మీ ఖాతాలో నగదు ఖాళీ అవ్వడం ఖాయం. ఈఎంఐలు వాయిదా వేయడానికి ఓటీపీకి, అస్సలు సంబంధమే లేదు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. తమ నగదు ఖాళీ అయ్యందంటూ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఎస్ బీఐ చెబుతోంది. సైబర్ క్రైమ్ చేసేవారి బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండటం ఒక్కటే మార్గమని ఎస్ బీఐ హెచ్చరించింది. ఈఎంఐ వాయిదా వంటి అంశాలపై వివరాల కోసం బ్యాంక్ వెబ్ సైట్ ను సందర్శించాలని తెలిపింది.

ఫ్రాడ్ కాల్స్ నమ్మి మోసపోకండి. ఎటువంటి అనుమానం వచ్చిన వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించండి.

Tags: coronavirus, lockdown, emi, fraud calls, fake calls, cyber crime


Next Story

Most Viewed