ఫోన్ లో అలా చేసి.. తండ్రి రూ. 20 వేలు పోగొట్టిన కొడుకు

by Sumithra |   ( Updated:2021-10-17 09:02:57.0  )
Phone-Talking
X

దిశ, బంజారాహిల్స్‌: ఇల్లు అద్దెకు తీసుకుంటామంటూ ఇంటి యజమానికి ఓ వ్యక్తి టోకరా వేసిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బంజారాహిల్స్‌రోడ్‌ నెం. 13లో నివసించే డి. వెంకటేశ్వరరావుకు శనివారం ఉదయం ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీ ఇల్లు అద్దెకు ఉందని ఓ వెబ్ సైట్ లో ప్రకటన చూశానని చెప్పగా వెంకటేశ్వరరావు తన ఫోన్‌ను కొడుకు అనిల్‌కు ఇచ్చాడు. ఇంటి అద్దె గురించి ఇద్దరి మధ్య చర్చల అనంతరం గూగుల్ పే వ్యాలెట్‌ ఓపెన్‌ చేస్తే డబ్బులు వస్తాయంటూ అందుకు సంబంధించిన లింక్‌ను పంపిస్తున్నట్లు చెప్పాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న అనిల్‌ ఆ లింక్‌ను క్లిక్‌ చేశాడు. క్షణాల వ్యవధిలోనే తండ్రి బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ. 20 వేలు డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన అనిల్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Next Story