- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్ షా రాజీనామా చేయాలి
దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ హింసకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సర్కారు బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ అన్నారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగానే వెంటనే భద్రత వ్యవస్థను రంగంలోకి దింపాల్సిందని, ఈ అల్లర్లను అదుపు చేయడంలో రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించి విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 72 గంటలపాటు ఢిల్లీ పోలీసులు సుప్తావస్థలో ఉన్నారని చెబుతూ.. ఢిల్లీ అల్లర్లు ఒక పథకం ప్రకారం జరిగాయని ఆరోపించారు. ఢిల్లీలో ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బుధవారం ఉదయం సమావేశమైంది. అనంతరం విలేకరులతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అలాగే, చికిత్స పొందుతున్నవారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ఆరు ప్రశ్నలను సంధించింది. సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ టాప్ లీడర్లు.. మన్మోహన్ సింగ్, ఏకే అంథోని, గులాం నబీ ఆజాద్, పీ. చిదంబరం, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు హాజరయ్యారు. కాగా, విదేశీ పర్యటనలో ఉండటంతో రాహుల్ గాంధీ గైర్హాజరైనట్టు సమాచారం.