‘ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరికాదు’

by Shyam |   ( Updated:2020-03-31 01:38:00.0  )
‘ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరికాదు’
X

దిశ, మెదక్: ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరికాదని, ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుల జి.తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. కరోనా వ్యాధిపై తెలంగాణ కంటే ఎక్కువగా పోరాడుతున్న మహారాష్ట్ర, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కేరళ ప్రభుత్వం కరోనా నిర్మూలనకు రూ.2 వేల కోట్లు కేటాయించిందన్నారు. ఒకవైపు నీతులు చెబుతూనే గోతులు తీసిన విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఉందని విమర్శించారు. ఉద్యోగులు సైతం ప్రజా జీవితంలో అంతర్భాగమేనని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బాధితులు కారా? ప్రభుత్వంతోపాటు ఉద్యోగులు కూడా కరోనా వ్యాధిపై పోరాటం చేయట్లేదా? అని ప్రశ్నించారు.

ఇప్పటివరకు ప్రభుత్వం ప్రజలకు ప్రకటించిన సబ్సిడీలు కేవలం రూ.1350 కోట్లు మాత్రమే కాగా ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1,82,914 కోట్ల బడ్జెట్టు ఏమైంది? కేంద్రం ప్రకటించిన రూ.500 కోట్లు ఏమైనట్టు? అని డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న తెలంగాణలో ఇంత దరిద్రం ఉందని ఎవరు అనుకోవట్లేదు. ఇది ఉద్యోగుల పైన కక్ష సాధింపు మాత్రమే. మనకంటే పేద రాష్ట్రాలైన ఒరిస్సా, చత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు.వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, చర్చించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని చేయాలని తెలిపారు.

Tags : Cutting, salaries, govt employees, medak, kerala, maharashtra, tptf

Advertisement

Next Story