పాప్ సాంగ్‌కు మేకపిల్లల ర్యాప్ డ్యాన్స్..

by Sujitha Rachapalli |
Cute Desi Goats Dance
X

దిశ, ఫీచర్స్ : పాపులర్ అయిన మాస్ బీట్స్‌కు మనుషులు డ్యాన్స్ చేయడం తెలుసు కానీ, మేకలు డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా? చూడలేదు కదా. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయ్యారంగా నడుస్తూ గుంపుగా వెళ్తున్న మేకలు.. ప్లే అవుతున్న సాంగ్ బీట్‌కు తగ్గట్లుగా డ్యాన్సింగ్ మూమెంట్స్ ఇవ్వడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

https://twitter.com/being_caravan/status/1285186367027208194?s=20

అమెరికన్ ఫేమస్ ర్యాపర్ ఎమినెం పాడిన ‘హు ఈజ్ బ్యాక్(Who’s Back)’ అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంటే, తమ చెవులను ఆడిస్తూ క్యూట్‌గా డ్యాన్స్ చేస్తున్నాయి గోట్స్. వీటి డ్యాన్స్ మూమెంట్స్‌ను చూసి మేకల యజమాని కూడా తెగ ఆనందపడుతున్నాడు. అయితే ఆ వీడియో ఏ ప్రాంతానికి చెందిందో మాత్రం వివరాలు తెలియరాలేదు. పెలియా వై ఫురియా అనే యూజర్ ఫేస్‌బుక్ వేదికగా ఈ ‘డ్యాన్సింగ్ గోట్స్’ వీడియో షేర్ చేయగా, ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.

Advertisement

Next Story