హైదరాబాద్‌కు బడ్జెట్ కేటాయింపుల్లో కోత

by Shyam |   ( Updated:2021-03-18 01:26:26.0  )
హైదరాబాద్‌కు బడ్జెట్ కేటాయింపుల్లో కోత
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే మాటలకు.. ప్రభుత్వ చేతలకు మధ్య పొంతన కుదరడం లేదు. తాజా బడ్జెట్ కేటాయింపులు చూసిన తర్వాత హైదరాబాద్‌ అభివృద్ధికి నిధులిచ్చేందుకు కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదేమో అనిపిస్తోంది. శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హైదరాబాద్ నగరానికి అన్ని కలిపి కేవలం రూ.3,625 కోట్లను మాత్రమే కేటాయించారు.

గతేడాది ప్రకటించిన బడ్జెట్‌లో వివిధ పనులతో కలిపి మొత్తం రూ.10 వేల కోట్లు నగరానికి కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు దాదాపు మూడో వంతు నిధులకు కోత విధించింది. ఈ సారి బడ్జెట్‌లో ఉచిత నీటి పథకానికి రూ.1,450 కోట్లను, హైదరాబాద్ మెట్రో కోసం రూ. వెయ్యి కోట్లు కేటాయించారు.

మూసీ నది పనుల కోం రూ.200 కోట్లను కేటాయించారు. నిధుల కొరతతో ఇప్పటికే హైదరాబాద్‌లో పలు ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులు వెనకబడుతున్న పరిస్థితిలో బడ్జెట్‌లో విధించిన కోత నగర అభివృద్ధిపై ప్రభావం చూపనుంది.

Advertisement

Next Story

Most Viewed