కరెంట్ అఫైర్స్: అవార్డులు

by Harish |   ( Updated:2022-11-29 14:38:45.0  )
కరెంట్ అఫైర్స్: అవార్డులు
X

రామోజీ ఫిల్మ్ సిటీకి ఆతిథ్య పురస్కారం ప్రదానం:

హోటల్, పర్యాటక రంగాల్లో అత్యుత్తమ సేవలకుగానూ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీకి దక్షిణ భారతంలో అత్యుత్తమ ఆతిధ్య రంగం సేవల పురస్కారాన్ని ఫిల్మ్ సిటీ ఎండీ సీహెచ్. విజయేశ్వరి అందుకున్నారు.


దలైలామాకు గాంధీ - మండేలా అవార్డు:

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గాంధీ - మండేలా అవార్డును టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు అందజేశారు.

స్థానిక మైక్లోడ్ గంజ్ ప్రాంతంలో గాంధీ - మండేలా ఫౌండేషన్ ఈ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించింది.

ఈ అవార్డుకు దలైలామా కన్న అర్హుడు మరొకరు లేరని, ఆయన ప్రపంచ శాంతి దూత అంటూ గవర్నర్ ఈ సందర్భంగా అన్నారు.



కుటుంబ నియంత్రణలో భారత్‌కు ఎక్సెల్ అవార్డు - 2022:

కుటుంబ నియంత్రణలో అత్యాధునిక విధానాల వినియోగం, నాయకత్వానికి ఇచ్చే ప్రతిష్టాత్మక ఎక్సెల్ అవార్డ్ - 2022 భారత్‌ను వరించింది.

అత్యాధునిక, అత్యంత నాణ్యమైన కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరిస్తున్న దేశాల విభాగంలో ఒక్క భారత్ మాత్రమే ఈ పురస్కారాన్ని దక్కించుకుంది.

థాయ్ లాండ్ లో జరుగుతున్న అంతర్జాతీయ కుటుంబ నియంత్రణ సదస్సు (ఐసీఎఫ్ సీ) సమావేశంలో ఈ అవార్డును ప్రకటించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ లో వెల్లడించారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 5 ప్రకారం.. దేశంలో 2015 - 16లో 54 శాతం ఉన్న గర్భనిరోధక రేటు (కాంట్రాసెప్టివ్ ప్రివలెన్స్ రేటు) 2019- 20 నాటికి 67 శాతానికి చేరింది.


అంతర్జాతీయ వ్యాసరచన పోటీలో భారత బాలికకు ప్రతిష్ఠాత్మక పురస్కారం:

ప్రపంచ ప్రఖ్యాత క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ లో భారత్ కు చెందిన 13 ఏళ్ల బాలిక సత్తా చాటింది.

ఉత్తరాఖండ్ కు చెందిన మౌలికా పాండే, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన పద్మశ్రీ జాదవ్ మొలాయి పాయెంగ్ యథార్ధ జీవితగాథను తన రచనా కౌశలం తో కళ్లకు కట్టింది.

ఈ ఏడాది నిర్వహించిన పోటీకి 'ది మొలాయి ఫారెస్ట్' శీర్షికతో కథ రాసి, జూనియర్ విభాగంలో రన్నరప్ గా నిలిచింది.



READ MORE

గ్రూప్ - 1 మెయిన్స్: సబ్జెక్టు కంటే స్ట్రాటజీ ముఖ్యం

Advertisement

Next Story