- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 25-1-2023
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్:
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంత కాలం ప్రధానిగా ఉన్న జెసిండా ఆర్డెన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అధికార లేబర్ పార్టీ ప్రతినిధులు సమావేశమై పార్టీ కొత్త నాయకుడిగా, దేశానికి 41వ ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ ను ఎన్నుకున్నారు.
జనవరి 25న ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తానని క్రిస్ అన్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 14న న్యూజిలాండ్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
నేవీలో చేరిన ఐఎన్ఎస్ వాగీర్:
కల్వరీ తరగతికి చెందిన ఐదో జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగీర్ భారత నేవీలో అధికారికంగా చేరింది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాజెక్టు 75 లో భాగంగా స్కార్పియన్ సాంకేతికతతో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ ఐఎన్ఎస్ వాగీర్‌ను నిర్మించింది. దీని కోసం ఫ్రాన్స్ నావల్ గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
వైర్ గైడెడ్ టార్పెడోలు, పాక్షిక ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, అత్యంత శక్తివంతమైన డీజిల్ ఇంజిన్లు, అత్యాధునిక సెన్సార్‌లు, టార్పెడో డెకాయ్, సోనార్, స్టెల్త్ వ్యవస్థలతో వాగీర్ ను అత్యున్నత సాంకేతికతతో నిర్మించారు. వాగీర్ అంటే షార్క్ అని అర్థమని, షార్క్‌కు ఉండే గోప్యత, నిర్భయత్వం దీని సొంతమని భారత నేవీ వెల్లడించింది.
జాతీయ బాల పురస్కారాల ప్రదానం:
వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 11 మంది చిన్నారులను ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ - 2023 లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళలు, సాంస్కృతిక విభాగంలో నలుగురికి, క్రీడా విభాగంలో ముగ్గురికి, నూతన ఆవిష్కరణల్లో ఇద్దరికి, శౌర్య, సామాజిక సేవ విభాగాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మందికి పురస్కారాలను అందించారు.
వీరిలో ఏపీ, తెలంగాణల నుంచి ఒక్కొక్కరు ఈ అవార్డును అందుకున్నారు.
అవార్డు గ్రహీతలకు పతకం, రూ. లక్ష నగదు, ధ్రువపత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించారు.