- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Current Affairs Today - Latest Current Affairs 2022: జాతీయం
కిసాన్ యూరియా ఇకపై.. భారత్ యూరియా:
తెలంగాణలోని రామగుండం ఎరువుల పరిశ్రమలో ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న కిసాన్ యూరియా ఇకపై భారత్ యూరియాగా విపణిలోకి వెళ్లనుంది.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో తయారయ్యే యూరియా ఇకపై ఒకే పేరు, నాణ్యత కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ ప్రకటించారు.
ఆర్ఎఫ్‌సీఎల్ గతంలో ఎఫ్‌సీఐగా ఉన్నప్పుడు స్వస్తిక్ పేరుతో, నిన్నటి వరకు కిసాన్ పేరుతో యూరియాను మార్కెటింగ్ చేయగా.. ఇక నుంచి భారత్ యూరియాగా విపణిలోకి వెళ్లనుంది.
ప్రసారభారతి సీఈవోగా గౌరవ్ ద్వివేది:
ఛత్తీస్‌గఢ్ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి గౌరవ్ ద్వివేది ప్రసారభారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమితులయ్యారు.
1995 బ్యాచ్ కు చెందిన ఆయన ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు.
ఆయన లోగడ పౌర వేదిక 'మై గవర్నమెంట్ ఇండియా ' సీఈవో గా సేవలందించారు.
బాలల సాహితీవేత్త పత్తిపాక మోహన్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు:
జాతిపిత మహాత్మా గాంధీ పై రాసిన బాలల తాత బాపూజీ గేయ కథకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది.
దీనిని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ పత్తిపాక మోహన్ రచించారు.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ కంబారా రచయితకు అందజేశారు.
పురస్కారంతో పాటు రూ. 50 వేల చెక్కు, తామ్రపత్రాన్ని మోహన్ కు ప్రదానం చేశారు.
దేశవ్యాప్తంగా 22 భాషల్లోని రచయితలకు ఈ అవార్డులను అందించి సత్కరించారు.
- Tags
- Current Affairs