- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరెంట్ అఫైర్స్: 30-11-22
9వ గ్లోబల్ ఫోరం ఆఫ్ ది అలియన్స్ ఆఫ్ సివిలైజేషన్స్ సదస్సు:
లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత ఉద్యమకర్త ఎల్సామేరీ డిసిల్వా కృషిపై ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ ప్రశంసలు కురిపించారు.
మొరాకోలోని ఫేజ్ నగరంలో ప్రారంభమైన 9వ గ్లోబల్ ఫోరం ఆఫ్ ది అలియన్స్ ఆఫ్ సివిలైజేషన్స్ సదస్సులో గుటెరస్ మాట్లాడారు.
నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేయడానికి, లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది యువతను కదిలించడానికి ఆమె ప్రయత్నాలు ఉపకరించాయని డిసిల్వాను అభినందించారు.
రెడ్ డాట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన ఆమె ఈ సంస్థ ద్వారా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
ఆసియా కుబేరుల జాబితాలో సునాక్, అక్షతా మూర్తి:
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి తొలిసారిగా యూకేకు చెందిన ఏషియన్ రిచ్ లిస్ట్ 2022 స్థానం పొందారు.
780 మిలియన్ పౌండ్ల (రూ. 7,700 కోట్ల) సంపదతో సునాక్, అక్షత ఈ జాబితాలో 17వ స్థానాన్ని దక్కించుకున్నారు.
ఈ ఏడాది జాబితాలోని వారి మొత్తం సంపద 113.2 బిలియన్ పౌండ్లుగా నమోదైంది.
వరుసగా ఎనిమిదో ఏడాది హిందుజా కుటుంబం 30.5 బిలియన్ పౌండ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
మలేసియా కొత్త ప్రధానిగా అన్వర్:
మలేసియాలో జరిగిన ఎన్నికలు హంగ్ పార్లమెంటుకు దారితీసిన రాజు ఆల్ సుల్తాన్ అబ్దుల్లా పలువురు పార్లమెంటు సభ్యులతో సంప్రదించి 75 ఏళ్ల అన్వర్ ఇబ్రహీం తో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
అన్వర్ సంస్కరణవాది కాగా, మితవాది అయిన మాజీ ప్రధాని ముహిముద్దీన్ యాసిన్ పార్టీ నేషనల్ అలయన్స్‌కు 73 సీట్లు వచ్చాయి.
20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి, జైలు శిక్షలు అనుభవించి, సంస్కరణల కోసం గట్టిగా నిలబడిన అన్వర్ పగ్గాలు చేపట్టడం తో దేశంలో స్టాక్ మార్కెట్ సూచీలు, మలేషియా కరెన్సీ విలువ పెరిగాయి.
నేపాల్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని దేవ్ బా విజయం:
నేపాల్ పార్లమెంట్ దిగువ సభ.. ప్రజా ప్రతినిధుల సభకు ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్ బా (77) భారీ మెజారిటీతో గెలిచారు.
గడిచిన ఏడు ఎన్నికల్లో దేవ్ బా వరుసగా విజయాలు సాధించారు.
ప్రస్తుతం 5వ సారి ప్రధాన మంత్రి పదవి నిర్వహిస్తున్నారు.
పార్లమెంట్ దిగువ సభ తో పాటు ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి.
భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ అనుమతి:
భారత్- ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్యం త్వరలోనే అమల్లోకి రానుంది.
ఇందుకోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
ఇరుదేశాలు అంగీకరించిన తేదీ నుంచి స్వేచ్ఛా వాణిజ్యం అమల్లోకి వస్తుంది.
భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి పార్లమెంట్ ఆమోదం పొందిందని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని తెలిపారు.
ఇండియా - ఆస్ట్రేలియా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఏఐ- ఈసీటీఏ) అమలు కావడానికి ముందు ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం 2023 జనవరి నుంచి అమల్లోకి రానుంది.
READ MORE
నర్సింగ్ అడ్మిషన్లలో హెల్త్యూనివర్సిటీ అత్యుత్సాహం.. ఈసారైనా న్యాయం జరిగేనా?
- Tags
- Current Affairs