జనరల్‌ సైన్స్‌ నుంచి ముఖ్యమైన ప్రశ్నలు

by Harish |
జనరల్‌ సైన్స్‌ నుంచి ముఖ్యమైన ప్రశ్నలు
X

1. పరమ శూన్య కెల్విన్ 0 K ఉష్ణోగ్రతకు సమానమైనది ఏది?

ans.-273 డిగ్రీలు

2. సెంటు డబ్బా మూత తీస్తే దాని వాసన ఆ గది అంతా వ్యాపించడాన్ని ఏమంటారు?

ans. వ్యాపనం

3. వాయువులను వేడి చేయడం ద్వారా వాటి ఘనపరిమాణం ఎలా ఉంటుంది?

ans. పెరుగుతుంది

4. క్యారీ బ్యాగ్ తయారీకి వాడే పాలిమర్ ఏది?

ans. పాలిథీన్

5. నాన్ స్టిక్ పాత్రలకు పూసే పూత ని ఏమంటారు, అలాగే దాని పాలిమర్ ఏది?

ans. టెఫ్లాన్ ను నాన్ స్టిక్ పాత్రలకు క్రింద పూస్తారు. దీని పాలిమర్-టెట్రా ఫ్లోరో ఇథిలీన్

6. పైపుల తయరీ కోసం ఏ రకమైన ప్లాస్టిక్‌ను వాడుతారు?

ans. పాలివినైల్‌క్లోరైడ్(pvc)

7. ద్రవ పదార్ధంలో ఒకే రకమైన అణువుల మధ్య గల ఆకర్షణ బలాలను ఏమంటారు?

ans. సంసంజన బలాలు

8. పంది మాంసం ద్వారా వచ్చే వ్యాధి పేరు ఏమిటి?

ans. టీనియాసిస్

9. శీతల పానీయాల్లో నిమ్మ వాసన కోసం ఉపయోగించే రసాయనం ఏది?

ans. సిట్రానెల్లాల్

10. ఏ విటమిన్ లోపం వలన రక్తం గడ్డకట్టుట ఆగిపోతుంది?

ans. విటమిన్ K

11. తెల్ల రక్త కణాల జీవిత కాలం ఎంత?

ans.12-13 రోజులు

12. అప్పుడే పుట్టిన శిశువులో ఎన్ని ఎముకలు ఉంటాయి?

ans.300

13. లుకేమియా వ్యాధి దేనికి సంబంధించింది?

ans. రక్తం

14. మానవుని పుర్రెలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి?

ans. 22

15. మానవుని శరీరంలో అతిపెద్ద ఎముక?

ans. ఫీమర్ ఎముక

16. మానవ శరీరంలో మొత్తం కండరాల సంఖ్య?

ans. 639

17. స్త్రీలలో గుండె సగటు బరువు ఎంత?

ans. 225 గ్రాములు

18. ఎర్ర రక్త కణాల జీవిత కాలం ఎంత?

ans. 120 రోజులు

19. రక్త వర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?

ans. కార్ల్ లాండ్ స్టెయినర్

20. ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఏర్పడతాయి?

ans. అస్తి మజ్జ

Advertisement

Next Story

Most Viewed