- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరెంట్ అఫైర్స్: 9-12-2022
దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగ వేదిక:
దేశంలో మొదటి సారిగా రాకెట్లను నింగిలోకి పంపేందుకు ప్రైవేటు ప్రయోగ వేదకను సిద్ధం చేశారు.
దీనికి అనుబంధంగా మిషన్ కంట్రోల్ సెంటర్ (ఎంసీసీ)ను నెలకొల్పారు.
త్వరలో రాకెట్ ప్రయోగానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఇప్పటికే 3 ప్రయోగ వేదికలు ఉండగా ..సమీపంలోనే ప్రైవేటు లాంచ్ వెహికల్ కోసం తొలి ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెచ్చారు. దీనిని చెన్నైకి చెందిన అగ్నికుల్ స్టార్టప్ ఏర్పాటు చేయగా ఇస్రో, ఇన్ స్పేస్ లు ప్రోత్సాహం అందించాయి.
ఈ సంస్థ ఉపయోగించే అగ్నిబాన్ రాకెట్ రెండు దశల ప్రయోగ వాహనం.
ఇది 700 కి.మీ ఎత్తులోని నిర్దేశిత కక్ష్యలకు వంద కిలోల పేలోడ్‌ను తీసుకెళ్తుంది.
ఇందులోని అగ్ని లెట్ అనేది ప్రపంచంలోనే తొలి సింగిల్ -పీస్ 3డీ ప్రింటెడ్ ఇంజిన్.
దీనిని దేశీయ పరిజ్ఞానంతో రూపొందించారు.
జాతీయ జీవవైవిధ్య మండలి చైర్మన్‌గా అచలేందర్ రెడ్డి:
జాతీయ బయోడైవర్సిటీ ఛైర్మన్ గా సిం. అచలేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
1986 భారత అటవీ సర్వీసుల (ఐఎఫ్ఎస్) బ్యాచ్ కు చెందిన ఆయన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.
జాతీయ బీసీ కమిషన్ చైర్ పర్సన్ గా హన్స్ రాజ్:
జాతీయ వనుకబడిన తరగతుల కమిషన్ చైర్ పర్సన్‌గా మహారాష్ట్రకు చెందిన భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి హన్స్ రాజ్ గంగారాం అహిర్ (68) బాధ్యతలు స్వీకరించారు.
మహారాష్ట్రలోని చంద్రాపూర్ లోక్ సభ స్థానం నుంచి 1996లో ఒకసారి, మళ్లీ 2004 నుంచి 2019 వరకు ఈయన ప్రాతినిధ్యం వహించారు.
ఏపీ సీఎస్ గా జవహర్ రెడ్డి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్.జవహర్ రెడ్డి నియమితులయ్యారు.
2024 జూన్ వరకు ఈ పోస్టులో కొనసాగనున్నారు.
- Tags
- Current Affairs