Latest Current Affairs 2022: 9-12-2022

by Harish |   ( Updated:2022-12-09 12:31:22.0  )
Latest Current Affairs 2022: 9-12-2022
X

ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభం:

ది స్క్వేర్ కిలోమీటర్ అరే (ఎస్ కేపీ) పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ఆస్ట్రేలియాలో మొదలైంది.

21వ శతాబ్దపు అతిపెద్ద సైన్స్ ప్రాజెక్టుల్లో ఒకటిగా దీన్ని అభివర్ణిస్తున్నారు.

2028 నాటికి ఇది అందుబాటులోకి రానుంది.

జీవ వైవిధ్య రక్షణలో వెనుకంజలో ఆసియా దేశాలు:

తమ భూభాగాల్లో 2020 కల్లా కనీసం 17 శాతం విస్తీర్ణంలో జీవవైవిధ్యాన్ని కాపాడాలన్న లక్ష్యాన్ని సాధించడంలో అత్యధిక ఆసియా దేశాలు విఫలమయ్యాయి.

ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలు 40 దేశాల్లో జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

2030 కల్లా 30 శాతం భూభాగంలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలన్న ఐక్యరాజ్య సమితి లక్ష్యానికి ఆసియా దేశాలు చాలా దూరంలో ఉన్నాయి.

2010లో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 2030 కల్లా గరిష్టంగా 30 శాతం, 2020 కల్లా కనీసం 17 శాతం భూభాగంలో పర్యావరణాన్ని సంరక్షిస్తామని 200 దేశాలు వాగ్దానం చేశాయి.

2020లో ప్రపంచ వ్యాప్తంగా సగటున 15.2 శాతం భూభాగాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడగలిగారు.

ఆసియాలో 16 దేశాలు మాత్రమే 17 శాతం లక్ష్యాన్ని సాధించాయి.

మొత్తం ఆసియా చూసుకుంటే కేవలం 13.2 శాతం భూభాగంలో లక్ష్య సాధన జరిగింది.

అధునాతన స్టెల్త్ బాంబర్‌ను ఆవిష్కరించిన అమెరికా:

కొన్నేళ్లుగా తెరచాటున అభివృద్ధి చేసిన అధునాతన ఆరో తరం స్టెల్త్ బాంబర్ విమానాన్ని తొలిసారిగా అమెరికా ప్రదర్శించింది.

చైనాతో ఘర్షణలు జరిగితే ఇది తమకు పైచేయి సాధించి పెడుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది.

బి - 21 రైడర్ అనే ఈ విహంగం, ప్రపంచంలోనే తొలి డిజిటల్ బాంబర్.

కాలిఫోర్నియాలోని పామ్‌డేల్ వైమానికి దళ స్థావరంలో ఆయుధ దిగ్గజం నార్తాప్ గ్రుమన్ సంస్థ దీనిని ఆవిష్కరించింది.

మత స్వేచ్ఛ ఉల్లంఘన దేశాల్లో రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాన్ :

మత స్వేచ్ఛను ఆందోళనకర స్థాయిలో అతిక్రమిస్తున్న దేశాల జాబితాను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ విడుదల చేశారు.

మొత్తం 12 దేశాలతో కూడిన ఆ జాబితాలో చైనా, రష్యా, పాకిస్తాన్, మియన్మార్ సౌదీ అరేబియా, ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా, నికరాగువా, తుర్క్ మెనిస్థాన్, తజికిస్తాన్, ఎరిత్రియా.. దేశాలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed