ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరోసారి కర్ఫ్యూ పొడిగింపు..

by Anukaran |   ( Updated:2021-08-15 03:49:03.0  )
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరోసారి కర్ఫ్యూ పొడిగింపు..
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల సంఖ్య ఇంకా నమోదు అవుతూనే ఉండటం..థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కొనసాగుతున్న ఈ కర్ఫ్యూను ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని..అలాగే మాస్క్ ధరించాలని సూచించింది. అలాగే వివాహాలు, శుభకార్యాలయాలకు కేవలం 150 మందికి మాత్రమే అనుమతినించింది. ఆ వేడుకల్లో కూడా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచించింది.

Advertisement

Next Story