ఏళ్లనాటి దారిద్ర్యానికి తెర పడింది

by Shyam |   ( Updated:2020-07-25 23:57:16.0  )
ఏళ్లనాటి దారిద్ర్యానికి తెర పడింది
X

దిశ, జనగామ: ఆ గ్రామంలో కొన్నేండ్లుగా సాగు నీళ్లు లేక పంట పొలాలు బీడు బారాయి. ప్రస్తుతం రిజర్వాయర్ నీరు రావడంతో పంట పొలాలు పచ్చదనంతో నిండిపోయాయి. జనగామ జిల్లా కేంద్రానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్మెట మండలం గండిరామారం వద్ద మల్లన్న గండి రిజర్వాయర్‌తో ఏళ్లనాటి దారిద్ర్యానికి తెర పడింది. ఒకప్పుడు నీటి వసతి గ్రామస్తులు ఉపాధి కోసం వలస బాట పట్టారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా గండిరామారంలో కట్టిన రిజర్వాయర్‌తో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. మెట్ట ప్రాంతం కావడంతో సాగునీటికి నోచుకొని భూములు ఇప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళ లాడుతున్నాయి.

ప్రాజెక్ట్ పరిధిలో సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, స్టేషన్ ఘనపూర్, చిలుపూరు మండలాల్లోని పలు చెరువులను నింపుతున్నారు. ఈ నీటితో పాటు వారం పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని పలు జలపాతాలు పరవళ్లు తొక్కుతూ చూపరులను కట్టిపడేస్తున్నాయి. జనగామకు అతి దగ్గరలో ఉన్న రిజర్వాయర్ సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వర్షాలు పడే సమయంలో రిజర్వాయర్ వద్ద రాళ్ల మధ్య నుంచి వస్తున్న వర్షపు జలధార జలపాతాన్నితలపిస్తోంది.

Advertisement

Next Story