- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆశ్చర్యం.. శునకానికి బిడ్డగా మారిన మేకపిల్ల
దిశ, అచ్చంపేట: ప్రస్తుత ఆధునిక సమాజంలో మనుషుల్లో మానవత్వం, ప్రేమానురాగాలు, సత్సంబంధాలు ఇలా చెప్పుకుంటూ పోతే శతృత్వం పెరుగుతుందే తప్పా.. కలిసి ఉండలేకపోతున్న సందర్భాలు, సంఘటనలు కోకొల్లలు. తల్లి పిల్లలను వేరుచేయడం, నవమాసాలు మోసి పుట్టిన బిడ్డను కూడా అమానుషంగా వదిలేస్తున్న సంఘటనలు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉన్నాం.
కానీ, మూగజీవాలలో జాతి వైరుధ్యాలు వేరు వేరు అయినప్పటికీ.. జ్ఞానం ఉన్న మనుషుల కంటే జ్ఞానం లేని మూగజీవాలు మెరుగని కొన్ని సంఘటనలు మానవాళి ఆలోచనకు భిన్నంగా కనిపిస్తుంటాయి. అలాంటి సంఘటన నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం కొత్తపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఓ రైతుకు చెందిన మేకపిల్ల తన జాతి వైరుధ్యాన్ని మరిచి వ్యవసాయ పొలంలో ఉన్న శునకం దగ్గరికి వెళ్లి పాలు తాగింది. ఈ వింత దృశ్యాలను సదరు రైతు మొబైల్‌లో చిత్రీకరించగా.. పలువురు యువకులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.