సీ-టెట్ పరీక్షలు వాయిదా

by  |   ( Updated:2021-12-16 21:41:54.0  )
post-phoned
X

దిశ, షాబాద్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET) 2021 పోస్ట్ పోన్ అయ్యింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) అయినటువంటి ఈ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహించనున్నారు. ఈనెల 16న నిర్వహించే పేపర్-2, 17న నిర్వహించే పేపర్-1, పేపర్-2 పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు డైరెక్టర్ పత్రికా ప్రకటనను రిలీజ్ చేశారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో తలెత్తిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పోస్ట్ పోన్ చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఈనెల 20న నిర్వహించనున్న పరీక్షను యథావిథిగా నిర్వహిస్తామన్నారు. పోస్ట్ పోన్ చేసిన పరీక్షల తేదీలు తొందరలోనే ఖరారు చేసి సమాచారం అందజేస్తామని తెలిపారు.

Advertisement

Next Story