- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైనాతో ఒప్పందాలన్నీ రద్దు చేసిన సీఎస్కే?
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్ ఆడటానికి యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేష్ రైనా అర్థాంతరంగా ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో తాను ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు రైనా మీడియాకు చెప్పాడు. వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కూడా సీజన్ ఆడలేనని సీఎస్కేకు వెల్లడించారు. ఇప్పటికే వీరిద్దరి పేర్లను సీఎస్కే జట్టు అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించారు. వచ్చే సీజన్‌కు అయినా వీళ్లు ఆడతారని అందరూ భావించారు. అయితే వీరిద్దరితో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని చెన్నై యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారమే వీరి ఒప్పందాలు రద్దు చేసుకోవడానికి ఫ్రాంచైజీ లీగల్ సెల్ ప్రక్రియ ప్రారంభించింది. 2018లో జరిగిన వేలం ప్రకారం వీరిద్దరితో మూడేళ్ల పాటు ఒప్పందం చేసుకుంది. ఈ సీజన్‌తోనే ఈ ఒప్పందం ముగిసిపోతుంది. రైనాకు రూ.11 కోట్లు, హర్బజన్‌కు రూ. 2 కోట్లు చెల్లించేలా ఈ ఒప్పందం ఉంది. కాగా, ఈ సీజన్ వీళ్లు ఆడటం లేదు కాబట్టి ఒప్పందం ప్రకారం డబ్బులు కూడా చెల్లించే అవకాశం లేదు. ఈ ఏడాది నిర్వహించాల్సిన ఐపీఎల్ వేలం కూడా బీసీసీఐ నిర్వహించే అవకాశం లేదు. దీంతో వీరిద్దరినీ వచ్చే సీజన్‌లో వేరే జట్లలో కూడా చూసే అవకాశం ఉండదు.