జెర్సీ సీన్ గుర్తు చేసిన హరిశంకర్ రెడ్డి

by Shiva |
జెర్సీ సీన్ గుర్తు చేసిన హరిశంకర్ రెడ్డి
X

దిశ, స్పోర్ట్స్: ఇండియా వంటి దేశంలో క్రికెట్‌లో ఎదగాలంటే అంత సులభం ఏమీ కాదు. టాలెంట్ ఉన్నా సరే అందరికీ అవకాశాలు రావు. కానీ కష్టపడే వారికి ఏదో రోజు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇదే పాయింట్ మీద తెలుగులో ‘జెర్సీ’ అనే సినిమా వచ్చింది. అందులో నానీ క్రికెట్ జట్టుకు ఎంపికైనప్పు ఆనందం పట్టలేక.. ఒక రైల్వే స్టేషన్‌కు వెళ్లి గట్టిగా అరుస్తాడు. తన భావోద్వేగాన్ని నానీ అలా బయట పెట్టుకుంటాడు. సరిగ్గా తన జీవితంలో కూడా అలాంటి భావోద్వేగమే సీఎస్కే జట్టుకు ఎంపికైనప్పుడు కలిగిందని హరిశంకర్ రెడ్డి పేర్కొన్నాడు.

కడప జిల్లాకు చెందిన ఈ యువ క్రికెటర్ ఇటీవల వేలంలో కనీస ధర రూ. 20 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. టీవీలో తాను ఎంపికైన విషయం చూసి చాలా గట్టిగా అరిచేశానని చెప్పాడు. తనకు జెర్సీ సినిమా చాలా ఇష్టమని.. అందులో ట్రెయిన్‌సీన్ అంటే మరింత ఇష్టమని హరిశంకర్ పేర్కొన్నాడు. తన జీవితంలో కూడా అలాంటి సంఘటన జరుగుతుందని అనుకోలేదన్నాడు. ఈ స్టోరీని వీడియోగా తీసి సీఎస్కే యాజమాన్యం తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.

Advertisement

Next Story