- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎస్, డీజీపీ పర్యటన
దిశ, మహబూబ్నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటికే రెండు కంటైన్‌మెంట్ జోన్లు ఉండటం ఆందోళన కలిగించే విషయమని సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అదే సమయంలో రోజురోజుకూ కేసులు పెరుగుతుండటం కలవర పెడుతోందని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు బుధవారం సీఎస్, డీజీపీ తదితర ఉన్నతాధికారులు కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో కేసులు అధికంగా నమోదు అవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోపాటు మిగతా ప్రాంతాల ప్రజలు బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. ముఖ్యంగా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. ఏ విషయంలో కూడా వెనుకడుగు, ఒత్తిళ్ళకు తలొగ్గాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ శ్రుతి ఓజా, ఎస్పీ అపూర్వరావు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags: CS somesh kumar, DGP mahender reddy, tour, meeting, SP, collector sruthi, Jogulamba Gadwal