సూర్యాపేటకు వచ్చిన సీఎస్ సోమేశ్‌కుమార్

by Shyam |
సూర్యాపేటకు వచ్చిన సీఎస్ సోమేశ్‌కుమార్
X

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్‌లు ప్రత్యేక హెలికాప్టర్‌లో బుధవారం సూర్యాపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కూరగాయల మార్కెట్‌తో పాటు కంటైన్‌మెంట్ ప్రాంతాలను పరిశీలించారు. నిత్యావసర సరుకులు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత పరిస్థితులపై కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

Tags: corona,suryapeta,cs someshkumar,visit

Advertisement

Next Story

Most Viewed