- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు సీఎస్ రావు అంత్యక్రియలు
హైదరాబాద్: ప్రముఖ సినీ, నవలా రచయిత, నటుడు చింతపెంట సత్యనారాయణ రావు(85) మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్‌లో జరుగనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’కు సీఎస్ రావు కథ అందించారు. అంతేకాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు కుక్కకాటుకు చెప్పుదెబ్బ, ఊరుమ్మడి బతుకులు (ఈ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నారు), వినాయకుడు వంటి సినిమాలకు సీఎస్ రావు కథలు అందించారు. అలాగే, సీనియర్ ఎన్టీఆర్ నటించిన సరదా రాముడు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సొమ్మొకడిది సోకొకడిది వంటి చిత్రాల్లో నటించారు. నాటక రంగంలో అనేక సేవలు చేసిన ఆయనను పలు అవార్డులు వరించాయి. కాగా, సత్యనారాయణకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
Tags: CS Rao, funeral, Hyderabad, today, megastar, pranam khareedu, NTR