- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మ్యాన్ హోళ్లలోకి మనుషులను దింపితే క్రిమినల్ కేసులు.. కాంట్రాక్టర్లకు బల్దియా గైడ్ లైన్స్
దిశ, సిటీ బ్యూరో: ఎల్బీనగర్ జోన్ లోని పద్మావతినగర్ లో డ్రైనేజీ నుంచి పూడికను తొలగించే పనులు చేస్తూ ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు బల్దియా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ప్రత్యేక గైడ్ లైన్స్ ను జారీ చేసింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలను, కమీషన్లను ప్రభావితం చేసిన ఈ ఘటన కాంట్రాక్టర్ కేవలం రాత్రి పూట పనులు చేయించటం వల్లే జరిగిందన్న విషయాన్ని పరోక్షంగా అంగీకరించిన బల్దియా కాంట్రాక్టర్లు ఖచ్చితంగా పాటించే నియమ, నిబంధనలతో కూడిన మెమోలు జారీ చేసింది.
ఈ రకంగా బల్దియా పరిధిలో వివిధ రకాలైన మెయింటనెన్స్ పనులు చేపట్టే దాదాపు రెండు వేల మంది కాంట్రాక్టర్లుకు ఈ మెమోలు జారీ చేశారు. అంతేగాక, పనులకు స్థానిక ఇంజనీర్లను పూర్తిగా బాధ్యులను చేస్తూ ఈ మెమోలు జారీ చేశారు. కాంట్రాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి పూట నాలాల పూడికతీత పనులు చేపట్టరాదని బల్దియా సూచించింది. ఒక వేళ చీకటి పడిన తర్వాత పూడికతీత పనులు చేపట్టాల్సిన అవసరం ఏర్పడితే ఉన్నతాధికారుల అనుమతులు తీసుకుని, కార్మికులకు పూర్తిగా భద్రతా ప్రమాణాలను చేకూర్చి, ఉన్నతాధికారులు, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే నిర్వహించాలని చీఫ్ ఇంజనీర్ దేవానంద్ మాడపాటి పేర్కొన్నారు. ఏ ఏరియాలో పూడికతీత పనులు రాత్రి, పగలు చేపట్టినా ఏ రోజుకారోజు స్థానిక అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ల కు సమాచారమిచ్చి, వారు అనుమతిస్తేనే పనులు చేపట్టాలని సూచించారు.
కాంట్రాక్టర్ ఏ కార్మికుడి చేత పనులు నిర్వహించినా, వారికి పూర్తి స్థాయి భధ్రత ప్రమాణాలను సమకూర్చిన తర్వాతే పనులకు అనుమతించాల్సి ఉంటుందని, ఈ నిబంధన సక్రమంగా అమలైతే పద్మావతి నగర్ లో సంభవించిన ఘటనలు పునరావృతం కావని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పగలంతా పనులు జరిగే ప్రాంతాల్లో రాత్రి పూట కూడా పనులు జరుగుతున్నాయా? అన్న విషయంపై స్థానిక ఇంజనీర్లు తనిఖీలు నిర్వహించాలని బల్దియా సూచించింది. డ్రైనేజీల్లో, మ్యాన్ హోళ్లలోకి కార్మికులనైనా, నిపుణలనైనా లోనికి అనుమతించే ప్రసక్తే లేదని. మ్యానువెల్ స్టావెంజింగ్ పై నిషేధమున్న విషయాన్ని గుర్తుంచుకుని పనులు చేపట్టాలని మెమోలో అధికారులు సూచించారు. ఈ నిబంధనను ఏ కాంట్రాక్టర్ ఉల్లంఘించినట్లయితే సదరు కాంట్రాక్టర్ గానీ, సంస్థ , ఏజెన్సీలపై కూడా సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.
మున్ముందు పనులన్నీ యంత్రాలతోనే..
యంత్రాలను ఆపరేట్ చేయటం మినహా మొత్తం పూడికతీత పనులను యంత్రాల ద్వారానే నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చీఫ్ ఇంజనీర్ (మెయింటనెన్స్) దేవానంద్ మాడపాటి తెలిపారు. నాలాల పూడికతీత పనులను ఇంకా మెరుగుగా ఎలా చేపట్టాలన్న అంశంపై ఐదు గురు అధికారులతో ఏర్పాటైన ఇన్నోవేషన్ కమిటీ ఈ విషయాన్ని అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఓ సారి సమావేశమైన ఈ కమిటీ మున్ముందు దేశంలోని ఇతర మహా నగరాల్లో నాలా పూడికతీత పనులు మానవేతరంగా నిర్వహించే అంశంపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.