USA News: అమెరికాలో తీవ్ర విషాదం.. హైదరాబాద్ యువకుడు దుర్మరణం

by Shiva |   ( Updated:2024-07-29 02:28:04.0  )
USA News: అమెరికాలో తీవ్ర విషాదం.. హైదరాబాద్ యువకుడు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో తీవ్ర విషాదం చోటుచేసకుంది. నగరంలోని కాటేదాన్‌ ప్రాంతానికి చెందిన అక్షిత్ రెడ్డి (26) చికాగోలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. అయితే, ఘటన ఈ నెల21న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడి మృతదేహం ఈ నెల 27న నగరానికి చేరుకోవడంతో ఆదివారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్ రెడ్డి, సమంత దంపతులు హైదరాబాద్‌లోని కాటేదాన్ ప్రాంతంలో స్థిరపడ్డారు. వారి ముగ్గురు సంతానం కాగా అందులో ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. ఇక కుమారుడు అక్షత్‌రెడ్డిన ఉన్నత చదువుల నిమిత్తం మూడేళ్ల క్రితం యూఎస్‌కు పంపించారు. షికాగోలో ఎమ్మెస్ కంప్లీట్ చేసిన అక్షిత్‌ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, గత శనివారం అక్షిత్ ఇద్దరు స్నేహితులతో కలిసి లేక్‌ మిషిగాన్‌‌లో ఈతకు వెళ్లాడు. ఒకరు ఒడ్డునే ఉండగా.. ఇద్దరు నీటిలో చెరువు అడుగు భాగం వరకు వెళ్లారు. తిరిగొచ్చే క్రమంలో అక్షిత్‌రెడ్డి అలసిపోయి నీట ముగిగాడు. అతడి వెంట ఉన్న స్నేహితుడు కూడా నీట మునిగిపోగా అక్కడున్నవారు చాకచక్యంగా రక్షించారు. అనంతరం రెస్క్యూ టీం లేక్ వద్దకు వచ్చి అక్షిత్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. శనివారం మృతదేహం హైదరాబాద్‌కు చేరుకోగా ఆదివారం అడ్డాకులలో అంత్యక్రియలు జరిగాయి.

Advertisement

Next Story