- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విషాదం.. కోతుల దాడిలో పదేళ్ల బాలుడు మృతి

దిశ, వెబ్‌డెస్క్: కోతి దాడిలో పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లో చోటు చేసుకుంది. ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దహేగాం తాలుకాలోని సల్కి గ్రామంలోని ఓ గుడి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన బాలుడిని దీపక్ ఠాకూర్ గా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో దీపక్ ఠాకూర్ తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. బాలుడి పేగులను కోతులు చీల్చినట్లు అధికారులు తెలిపారు.
స్థానికంగా ఉన్న ఆస్పత్రికి హుటాహుటిన తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. వారం వ్యవధిలో కోతులు ఇదే చోటు వద్ద మూడోసారి దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. అటవీ శాఖ అధికారి విశాల్ చౌదరి మాట్లాడుతూ.. గ్రామంలో కోతులను బందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో కోతులు ఉన్నాయన్నారు. వారం వ్యవధిలో నలుగురిపై కోతులు దాడికి పాల్పడ్డాయని అధికారులు తెలిపారు.