సీసీ కెమెరాలు లేని ఇళ్లే వారి టార్గెట్​

by Sridhar Babu |   ( Updated:2024-08-30 13:28:48.0  )
సీసీ కెమెరాలు లేని ఇళ్లే వారి టార్గెట్​
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ పట్టణంలోని ఇంద్రపురి కాలనీలో దొంగలు పడి మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు ఇంద్రపురి కాలనీలో నివాసం ఉంటున్న హనుమత్ రెడ్డి, లాల్ సింగ్, మోహన్ గౌడ్ లు ఇంటికి తాళం వేసి బంధువుల వద్ద కు వెళ్లారు. కాలనీలో చొరబడిన దొంగలు తాళాలు ఉన్న సీసీ కెమెరాలు లేని వాటిని మాత్రమే గుర్తించి చోరీకి పాల్పడ్డారు. మూడు ఇళ్ల తాళాలు పగల కొట్టి అందులో ఉన్న బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. ఇంటి ముందు పార్క్ చేసిన పల్సర్ బైక్ కూడా చోరీకి గురైంది.

Advertisement

Next Story