ఘోర రోడ్డు ప్రమాదం..కొడుకు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-28 04:05:10.0  )
ఘోర రోడ్డు ప్రమాదం..కొడుకు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు
X

దిశ,మేడ్చల్ టౌన్: బైకును వెనుక నుంచి లారీ ఢీ కొట్టిన సంఘటనలో కొడుకు మృతి చెందగా తండ్రికి గాయాలైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బురుగు రవీందర్ తన కొడుకు సాత్విక్ తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద వెనుక నుండి లారీ(ap29tb8855) ఢీకొట్టింది. దీంతో సాత్విక్ అక్కడికక్కడే మృతి చెందగా రవీందర్‌కు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story