భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం, ఏడుగురి పరిస్థితి సీరియస్

by GSrikanth |   ( Updated:2024-04-25 13:17:02.0  )
భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం, ఏడుగురి పరిస్థితి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌ రాష్ట్ర రాజధాని పాట్నలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం పాట్నా నగరంలోని ఓ హోటల్‌లో ఒక్కసారిగా భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాద సమయంలో హోటల్‌లో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో 30 మందికి తీవ్ర గాయాలు కాగా, ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పాట్నాలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోలంబార్‌లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. నాలుగైదు ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed