ఘోరం ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడులు

by Jakkula Mamatha |   ( Updated:2024-03-06 16:48:56.0  )
ఘోరం ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడులు
X

దిశ, ఏలూరు: నగర పరిధిలో రెండు ఘటనల్లో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడులు జరిగిన విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు శాంతినగర్ ప్రాంతంలో ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై మేనమామ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. శ్రీను అనే నలభై ఏళ్ల వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. క్రిస్మస్ రోజున బాధితురాలు తన మేనమామ ఇంటికి వెళ్లింది, ఆ సమయంలో ఇంట్లో భార్య, పిల్లలు లేకపోవడంతో ఆమెపై మేనమామ అత్యాచారానికి యత్నించాడు.ఈ విషయాన్ని బాధితురాలి తల్లి దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దిశ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విశ్వం కేసు దర్యాప్తు చేస్తున్నారు

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల మానసిక వికలాంగ బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు బుధవారం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. జామపండు ఇస్తానని కనకరావు అనే వ్యక్తి బాలికను ప్రలోభపెట్టి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. కొందరు పిల్లలు ఈ ఘటనను గమనించి అప్రమత్తమయ్యారు. దీంతో నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఏలూరు రూరల్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాజారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Read More..

వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా.. త్వరలో జనసేనలోకి!

Advertisement

Next Story