వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న జనం

by Aamani |   ( Updated:2024-08-14 09:51:26.0  )
వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న జనం
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మొలంగూర్ అడ్డరోడ్డులో గల రాజరాజేశ్వర హోటల్లో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారని షాపు యజమాని తెలిపాడు. వివరాల్లోకి వెళితే మొలంగూరు గ్రామానికి చెందిన జున్నూరి తిరుపతి - తిరుమల అను భార్యాభర్తలు జీవనోపాధికై చిన్నపాటి హోటల్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల క్రింద ఈ హోటల్ ను ప్రారంభించినట్లు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చొరబడి పదివేల రూపాయల విలువ గల నాలుగు పట్టు చీరలు, హోటల్ సామాగ్రి అయిన చికెన్ కడాయిలు, క్యాష్ కౌంటర్ లో ఉన్న పదివేల రూపాయల నగదును దొంగలు తస్కరించకపోయినట్లు తెలిపారు.

షాప్ కి వెనక డోర్ స్క్రూలను విప్పి షాపులోకి ప్రవేశించినట్లు తెలిపారు. ఇదే హోటల్ లో ఆదివారం రోజు కూడా దొంగతనం జరిగినట్లు బాధితులు వాపోయారు. దొంగతనం జరిగి రెండు రోజులు కాకముందే మళ్ళీ దొంగతనం జరిగిందని ఆవేదన వెలిబుచ్చారు. మొదటిసారి దొంగతనం జరిగినప్పుడు నగదురూ. 32 వేలు ఎత్తుకెళ్లారని మళ్లీ మంగళవారం రోజు రెండు బీరువాలను పగులగొట్టి విలువైన దుస్తులను ఎత్తుకెళ్లి నట్లు తెలిపారు. రోజు లాగే ఉదయం 6 గంటలకు హోటలు తీయడానికి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంత, లబోదిబోమన్నారు. స్థానిక కేశవపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed