- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Morocco Earthquake : ఘోర విషాదం.. 632కు చేరిన భూకంప మృతుల సంఖ్య
X
దిశ, వెబ్‌డెస్క్: 6.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం మొరాకో దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రోజు ఉదయం ఈ భూకంపం కారణంగా 296 మంది మృతి చెందగా.. తాజాగా ఆ మృతుల సంఖ్య 632కు చేరింది. అలాగే గాయపడిన వారి సంఖ్య 329 కి చేరింది. ఇందులో దాదాపు మరో 50 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ఒక శతాబ్దానికి పైగా ఉత్తర ఆఫ్రికా దేశంలోని ఆ భాగాన్ని తాకిన బలమైన ప్రకంపన అని పేర్కొంది. రాత్రి 11:11 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మర్రకేష్‌కు నైరుతి దిశలో 71 కిలోమీటర్ల దూరంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. తీరప్రాంత నగరాలైన రబాత్, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో కూడా భూకంపం సంభవించింది. కాగా ఈ భారీ భూకంపం కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Advertisement
Next Story