జానీ మాస్టర్ కు 14 రోజులు రిమాండ్

by Sridhar Babu |   ( Updated:2024-09-20 11:24:27.0  )
జానీ మాస్టర్ కు 14 రోజులు రిమాండ్
X

దిశ, గండిపేట్ : అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. డ్యాన్స్ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం, పోక్సోతో పాటు పలు కేసులు నమోదు చేశారు. కాగా అప్పటి నుండి జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. కొరియోగ్రాఫర్ జానీని గాలించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

చివరకు గోవాలో ఉన్నట్లు గుర్తించి సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసు టీం ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ఆయన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. జానీ మాస్టర్‌కు అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధిస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు తీర్పునిచ్చింది. మొత్తం 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. మరి కాసేపట్లో పోలీసులు ఆయనను చెంచలగూడ జైలుకు తరలించనున్నారని తెలుస్తోంది. జానీ మాస్టర్‌పై కేసు నమోదవడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో ఆయన తరుపు న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్​ వేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Next Story