- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరికి లొకేషన్ పంపిన MLA లాస్య పీఏ ఆకాష్
దిశ, రాచకొండ: ఓఆర్ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆమె మరణంపై పటాన్‌చెరు పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కారు ఓఆర్ఆర్ ఎక్కిన నిమిషాల్లోనే ప్రమాదానికి గురైందని అన్నారు. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే పీఏ ఆకాష్ కారును డ్రైవ్ చేస్తూ ముందు సీట్లో కూర్చున్నాడు. ప్రయాణ సమయంలో ఇద్దరూ సీట్ బెల్ట్ ధరించారు. ఢీకొట్టిన ధాటికి ఎయిర్ బ్యాగ్స్ బయటికి వచ్చినప్పటికీ లాస్య నందిత ప్రాణాలు దక్కలేదు. పీఏ ఆకాష్ కాలు విరిగి పోయింది. తలకు తీవ్ర గాయమైంది. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్నాం. కేసు నమోదు చేసుకొని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
లొకేషన్ పంపిన పీఏ ఆకాష్
ప్రమాదం జరిగిన తీరుకు పీఏ ఆకాష్ భయాందోళనకు గురయ్యాడు. వెంటనే తన ఫోన్ ద్వారా ఇద్దరికి ఫోన్ చేసాడు. యాక్సిడెంట్ అయ్యింది కారులో మేడం కూడా ఉంది వెంటనే రండి అని సమాచారం ఇచ్చాడు. వారికి లొకేషన్ కూడా పంపాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపు పరిస్థితి విషమించి ఎమ్మెల్యే తుదిశ్వాస విడిచారు.
అయితే, ముందుగా ఫంక్షన్ ఉందని కుటుంబ సభ్యులతో గురువారం సాయంత్రం సదాశివాపేటకు వచ్చిన ఎమ్మెల్యే.. వచ్చిన వెంటనే పని ఉందని పీఏ ఆకాష్‌ను తీసుకుని బయలు దేరిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.