మీరాకిల్ హాస్పిటల్ లో అమానుషం...

by Sridhar Babu |   ( Updated:2024-08-13 14:20:28.0  )
మీరాకిల్ హాస్పిటల్ లో అమానుషం...
X

దిశ, మేడిపల్లి : డెలివరీ అవగానే చెకప్ కోసం పీర్జాదిగూడ మిరాకల్ హాస్పిటల్ కు తమ కవల పిల్లలను తీసుకువస్తే వైద్యుల నిర్లక్ష్యంతో తమ 25 రోజుల చిన్నారి చేతి వేళ్లు తొలగించాలని వైద్యులు తెలియజేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మొండికుంట తండా, బొమ్మలరామారం మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సుధాకర్ నాయక్, అనిత దంపతులు. అనిత గత 25 రోజుల క్రితం పీర్జాదిగూడ శ్రీజ హాస్పిటల్ లో డెలివరీ అయింది. ఆమెకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు.

పరీక్షల నిమిత్తం పీర్జాదిగూడ మిరాకల్ హాస్పిటల్ కు తీసుకువచ్చారు. 25 రోజులుగా ఇద్దరు పిల్లలకు ఐసీయూ లో వైద్యం అందిస్తున్నారు. ఈ సమయంలో ఓ బేబీకి సెలైన్ ఎక్కించే క్రమంలో చేతి వెళ్లకు గాజు బట్టతో కట్టారు. ఈ క్రమంలో సిబ్బంది అజాగ్రత్త వల్ల చేతి వేళ్లు అన్నీ కొన్ని రోజులుగా కట్టేయడంతో రక్త ప్రసరణ లేక చేతి వేళ్లు చచ్చుపడిపోయాయి. దీంతో సిబ్బంది తప్పును కప్పిపుచ్చి చేతి వేళ్లకు ఇన్ఫెక్షన్ అయిందని, చేతి వేళ్లు ఊడిపోతాయని బంధువులకు సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఇప్పటివరకు 25 రోజుల పాపకు సుమారు రూ.10 లక్షలు చెల్లించామని, మిరాకిల్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story