- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం.. అంధకారంలో 30 గ్రామాలు..!
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి సబ్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి సబ్ స్టేషన్‌లో ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సబ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో కరెంట్ లేక దాదాపు 30 గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. సబ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. దాదాపు 30 గ్రామాలకు కరెంట్ నిలిచిపోవడంతో విద్యుత్ పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపీరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.