ఢిల్లీ యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

by Satheesh |   ( Updated:2023-10-21 06:31:45.0  )
ఢిల్లీ యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఢిల్లీ నుండి జార్ఖండ్ వెళ్తుండగా.. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై గుర్తు తెలియని ఓ వాహనం కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహ అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. చికిత్స నిమిత్తం క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story