కత్తిపోట్ల కలకలం.. ఇద్దరు యువకులను కత్తితో పొడిచిన మరో వ్యక్తి

by Aamani |   ( Updated:2024-04-11 15:50:18.0  )
కత్తిపోట్ల కలకలం.. ఇద్దరు యువకులను కత్తితో పొడిచిన మరో వ్యక్తి
X

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గురువారం కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది. రంజాన్ పండగ పూట జరిగిన ఈ సంఘటనతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చిరు వ్యాపారం చేస్తున్న కొందరు యువకులు వ్యాపారం డబ్బుల విషయంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఓల్డ్ బస్టాండ్ సమీపంలో గురువారం ఘర్షణ జరిగింది. ఇందులో ముజాహిద్, షాహిద్, తన్వీర్ షేక్ అక్రమ్ లతో పాటు షేక్ ఫజల్ లు ఒకరి నొకరు దూషించుకున్నారు. ఇందులో ఫజల్ అనే వ్యక్తి ముజాహిద్ ,షాహిద్ అనే ఇద్దరు యువకులపై కత్తితో దాడి చేయగా, వీరు తీవ్ర గాయాల పాలయ్యారు.

వెంటనే వీరిని స్థానికులు హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన జరిగిన దానిపై విచారణ చేపడుతుండగా... దాడిలో గాయపడిన వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు. కాగా దాడికి పాల్పడిన ఫజల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే రంజాన్ పండుగ పూట జరిగిన ఘర్షణ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు.

Advertisement

Next Story