విషాదం : పాము కాటుకు గురై చిన్నారి మృతి

by Kalyani |   ( Updated:2024-09-21 10:47:11.0  )
విషాదం : పాము కాటుకు గురై చిన్నారి మృతి
X

దిశ, చింతపల్లి (చందంపేట) : చందంపేట మండలం పొగిళ్ల గ్రామంలో శనివారం పాము కాటుకు గురై చిన్నారి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పొగిళ్ల గ్రామానికి చెందిన కరంటోతూ కిషన్ నాయక్- గంగ దంపతుల కుమార్తె పవిత్ర (5) సంవత్సరాలు బాత్రూంకి వెళ్ళగా పాముకాటుకు గురైందని కుటుంబ సభ్యులు తెలిపారు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పాపను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పాప మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Next Story