BREAKING: నగర శివార్లలో రేవ్ పార్టీ కలకలం.. వివాదంలో బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ షేక్‌..!

by Shiva |   ( Updated:2024-07-31 09:08:01.0  )
BREAKING: నగర శివార్లలో రేవ్ పార్టీ కలకలం.. వివాదంలో బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ షేక్‌..!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రేవ్ పార్టీలపై పోలీస్ డిపార్ట్‌మెంట్ ఫుల్ ఫోకస్ పెట్టింది. యువతకు డ్రగ్స్‌కు బానిసలు అవుతోన్న వేళ క్లబ్బులు, పబ్బులపై టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు, నార్కొటిక్ బ్యూరో ఎప్పటికప్పుడు మెరుపు దాడులు చేస్తూ మత్తు పదార్థాలు సేవించిన వారిపై, యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, ఘట్కేసర్ మండల పరిధిలోని అంకుషాపూర్ గ్రామంలో ది కాంటినెంటల్ రిసార్ట్స్‌పై జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్, ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడుల్లో బిగ్‌బాస్ ఫేం మహబూబ్ షేక్, తమ్ముడు షేక్ సుభాన్, స్నేహితుడు కోలా సుధీర్ కుమార్ అడ్డంగా దొరికినట్లుగా తెలుస్తోంది. అతడి పుట్టిన రోజు సందర్భంగా రిసార్ట్‌లో రేవ్ పార్టీ నిర్వహించారని, ఆ పార్టీకి బుల్లితెర నటులు, సెలబ్రిటీలు కూడా హాజరయ్యారని సమాచారం. విషయం తెలుసుకున్న జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ బృందం, ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా కాంటినెంటల్ రిసార్ట్స్‌పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న మద్యం బాటిళ్ల ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. అనంతరం బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ షేక్‌ సోదరుడు షేక్ సుభాన్, స్నేహితుడు కోలా సుధీర్ కుమార్, రిసార్ట్స్ మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్‌పై కూడా కేసు నమోదు చేసినట్లుగా ఎక్సైజ్ సీఐ రవి తెలిపారు.

Advertisement

Next Story