BREAKING: హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే వ్యక్తి దారుణ హత్య.. కత్తితో దారుణంగా..

by Shiva |   ( Updated:2024-03-19 13:09:17.0  )
BREAKING: హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే వ్యక్తి దారుణ హత్య.. కత్తితో దారుణంగా..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలో నాగోల్ లక్ష్మినరసింహ కాలనీలో మల్లీకార్జున్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే, ఇవాళ కొందరు దుండగులు మల్లీకార్జున్‌ను కత్తితో గొంతు కోసి అతి దారుణంగా హతమార్చారు. అనంతరం దుండుగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

Next Story