BREAKING: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే లారీ డ్రైవర్ దుర్మరణం

by Shiva |   ( Updated:2024-03-14 05:13:54.0  )
BREAKING: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే లారీ డ్రైవర్ దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్/శేరిలింగంపల్లి: లారీ టైరు బ్లాస్ట్ అయి అతివేగంతో లారీని మరో లారీ ఢీకొట్టగా ఒకరు దుర్మరణం పాలైన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఇవాళ తెల్లవారుజామున కోకాపేట్ వైపున వెళ్తున్న ఓ లారీ టైర్లు ఉన్నట్టుండి బ్లాస్ట్ అయ్యాయి. దీంతో ఆ లారీ కాస్త రోడ్డు పక్కనే నిలిపిన మరో లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ లారీ సీటు భాగంలో ఇరుక్కుని కాపాడండంటూ కేకలు పెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో డ్రైవర్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ, డ్రైవర్ అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story