BREAKING: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం

by Shiva |   ( Updated:2024-02-26 03:22:28.0  )
BREAKING: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌లోని కైమూర్ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు, జీపు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. పోలీసులు కథనం మేరకు.. వేగంగా వెళ్తున్న జీపును మొదట మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టింది. అనంతరం ఆ రెండు వాహనాలు ఎదురు లేన్‌లో వస్తున్న ట్రక్కును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. జీప్‌ డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగిందని మోహానియా డీఎస్పీ దిలీప్‌కుమార్ తెలిపారు.

Advertisement

Next Story