BREAKING: మియాపూర్ ఓయో లాడ్జీలో దారుణం..అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

by Shiva |   ( Updated:2024-05-26 09:35:21.0  )
BREAKING: మియాపూర్ ఓయో లాడ్జీలో దారుణం..అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పరిధిలోని మియాపూర్ ఓయో లాడ్జీలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లాడ్జీ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిని క్షణ్ణంగా పరిశీలించారు. అయితే, చనిపోయిన వ్యక్తిని ఆంధ్రా ప్రాంతానికి చెందిన జయ ప్రకాశ్‌గా గుర్తించారు. అదేవిధంగా ఆయన విషం మాత్రలు మింగినట్లుగా లాడ్జీ గదిలో ఆనవాళ్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జయ ప్రకాష్ రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. జరిగింది హత్యా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story