- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: మేడ్చల్ జిల్లాలో దారుణం.. బీర్ బాటిల్‌తో యువకుడిపై దాడి
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా లభ్యం అవుతుండటంతో యువత మత్తులో జోగుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గంజాయి సేవిస్తూ నడిరోడ్లపై హల్‌చల్ సృష్టిస్తున్నారు. ఎక్కిన మత్తుతో వారు ఏం చేస్తున్నారనే సోయి లేకుండా.. అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రాణాలను తీసేందుకు సైతం ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే మంగళవారం మేడ్చల్ జిల్లాలోని గాగిల్లాపూర్‌లో కొంతమంది యువకులు గంజాయి సేవించి హల్‌చల్ సృష్టించారు. ఏకంగా తోటి స్నేహితుడిపై కొందరు యువకులు బీరు బాటిల్‌తో విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు గమనించి సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులు మదన్ కుమార్, సాయిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.