- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel-Hamas : దారుణం: తల్లి గర్భాన్ని చీల్చి బిడ్డను పొడిచి చంపేశారు!
దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం బీకర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్‌లో హమాస్ టెర్రరిస్ట్‌లు దారుణాలకు ఒడిగడుతున్నారు. కారుల్లోనే ఇజ్రాయెల్ పౌరులను సజీవ దహనం చేయడం, వృద్ధులను, యువతలను అతి కిరాతకంగా హతమారుస్తున్నారు. ఇదిలా ఉండగా, గాజా స్ట్రిప్‌లో సమీపంలో ఓ ఇంట్లో నిండు గర్భిణి పొట్టను చీల్చి బిడ్డను పొడిచి చంపిన ఘోరమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదాలు జరిగిన సమయంలో మృతదేహాలను ఖననాలకు తీసుకెళ్లే యోసి లాండౌ అనే వాలంటీర్ ఈ దారుణాన్ని మీడియాకు తెలిపారు. ఘటన స్థలంలో మహిళ మృతదేహాన్ని చూడగానే మాకు స్పృహ కోల్పోయినట్లు అనిపించిందని అని వెల్లడించారు.
ఇక, ఇజ్రాయెల్, హమాస్ టెర్రరిస్ట్‌ల మధ్య జరుగుతోన్న హోరాహోరీ దాడిలో ఇప్పటికి వేల మంది చనిపోయారు. హమాస్ తీవ్రవాద సైన్యం ఇజ్రాయెల్‌కు చెందిన పౌరులను, చిన్నపిల్లలను బందీలు చేసుకుని, తమపై దాడులు ఆపేస్తామని హెచ్చరికలు చేసింది. అయినా కూడా ఇజ్రాయెల్ తీవ్రవాదులను అంతం చేయడం కోసం యుద్ధ విమానాలతో హమాస్‌కు చెందిన కీలక ప్రాంతాలు భవనాలపై దాడులు చేస్తూ నేలమట్టం చేస్తుంది.