రాష్ట్రంలో మరో ఘోరం.. విద్యార్థిని బైక్‌పై ఎత్తుకెళ్లి అఘాయిత్యం

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-19 11:05:42.0  )
రాష్ట్రంలో మరో ఘోరం.. విద్యార్థిని బైక్‌పై ఎత్తుకెళ్లి అఘాయిత్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నూతిపాడు గ్రామంలో చోటుచేసుకుంది. కాలేజీ ముగించుకొని ఇంటికి వెళుతున్న విద్యార్థినిని మరో ఇద్దరు స్నేహితుల సాయంతో బలవంతంగా బైక్ ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. గతంలో అనేకమార్లు సదరు యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. తన ప్రేమను అంగీకరించడం లేదనే కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. విషయం తెలిసిన వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఏలూరులో మహిళలపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

Advertisement

Next Story