గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

by Sumithra |   ( Updated:2024-08-09 16:38:35.0  )
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
X

దిశ, మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండల పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు రూరల్ ఎస్సై నరేష్ తెలిపారు. శుక్రవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం రైల్వే స్టేషన్ సమీపంలో చెట్లలో మృతదేహం ఉన్నట్లు ప్రకాష్ నగర్ కు చెందిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్ధలానికి వెళ్లి పరిశీలించగా మృతుడు 55 ఎళ్ల వయస్సు ఉంటుందని అన్నారు. మృతుని వద్ద ఓ కవర్ లో పురుగుల మందు ఉన్నట్లు గుర్తించారు. పురుగుల మందు సేవించి అత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని బావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story