- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా.. పది మందికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
దిశ, అయిజ: కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అయిజా పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలమ్మపేటకు చెందిన సుమారు 30 మంది కూలీలు ఉదయం పనికోసం ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో ఆటో కట్టకింద తిమ్మప్ప స్వామి ఆలయం వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గమనించిన స్థానికులు గాయపడిన కూలీలను చికిత్స నిమిత్సం సమీప ఆసుపత్రికి తరలించారు. నిబంధనలు అతిక్రమించి కొందరు ఆటోల డ్రైవర్లు తమ సామర్థ్యానికి మించి కూలీలను ఆటోల్లో ఎక్కించుకు వెళ్తున్నారు. వారి ర్యాస్ డ్రైవింగ్ వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయని పట్టణవాసులు ఆరోపిస్తున్నరు. ఇలా బాధ్యత లేకుండా డ్రైవింగ్ చేస్తున్న ఆటో డ్రైవర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.