కాలేజీలో లైంగికంగా వేధిస్తోన్న సీనియర్.. తట్టుకోలేక దారుణానికి ఒడిగట్టిన విద్యార్థి

by Jakkula Mamatha |   ( Updated:2024-08-13 14:55:39.0  )
కాలేజీలో లైంగికంగా వేధిస్తోన్న సీనియర్.. తట్టుకోలేక దారుణానికి ఒడిగట్టిన విద్యార్థి
X

దిశ,వెబ్‌డెస్క్: నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌కి ఓ విద్యార్థి బలయ్యాడు. తోటి విద్యార్థుల లైంగిక వేధింపులతో బీడీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రదీప్ కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్య చేసుకునే ముందు రాహుల్ అనే ఎంబీబీఎస్ విద్యార్థి తనని లైంగికంగా వేధించాడని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని తన అన్నయకు మెసేజ్ చేసి బిల్డింగ్ పై నుంచి దూకినట్లు తెలుస్తోంది. ప్రదీప్ మృతి చెందిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం, విద్యార్థుల ర్యాగింగ్ వల్లే ప్రదీప్ చనిపోయాడాని తమ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed