మహిళతో కలిసి గదిలోకి భర్త.. ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భార్య!

by Nagaya |   ( Updated:2024-04-26 08:07:30.0  )
మహిళతో కలిసి గదిలోకి భర్త.. ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భార్య!
X

దిశ, రాజాపేట: వివాహేతర సంబంధం రెండు ప్రాణాలను బలిగొన్న సంఘటన రాజపేటలో వెలుగుచూసింది. రాజపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజపేట జంగాల కాలనీకి చెందిన చింతల పులేందర్, జనగాం జిల్లా బచ్చన్నపేటకు చెందిన ఓ మహిళ గురువారం ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో ఒకే గదిలో ఉన్నారు. ఇది గమనించిన పులేందర్ భార్య తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తూ వారిద్దరు ఉన్న ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.

దీంతో భయపడిపోయిన పులేందర్, సదరు మహిళ ఆ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు వచ్చి చూసేసరికి ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటనపై రాజపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుపై సాయంత్రం వరకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed